తిరుమల అలిపిరి మార్గంలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. భక్తులను దోపిడి చేసేందుకు విఫలయత్నం చేశారు. 2,830 మెట్టు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ ఫ్లాష్ లైట్‌తో తమను వెంబడించినట్టుగా కర్నూలుకు చెందిన ఓ భక్తుడు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అదించాడు. తమ వద్ద ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అ తర్వాత వారి నుంచి తప్పించుకోడానికి పరుగులు పెట్టినట్టు పోలీసులకు వివరించాడు.
భక్తుడి ఫోన్ కాల్‌తో పోలీసులు వెంటనే స్పందించి బాధితులను కాపాడారు. టీటీడీ విజిలెన్స్ సాయంతో సురక్షితంగా తిరుమలకు తీసుకెళ్లారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.