చాలా మంది మారుతున్న సాంకేతిక పోకడలకు అనుగుణంగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే చాలా మంది ఫోన్ లను మార్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మీ ఫోన్ లు పాతవి అయిపోయినా సరే వాటిని అమ్మకుండా లేదా మూలపడేయకుండా మరో విధంగా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. సరిగా వాడుకుంటే మాత్రం మీ పాత సెల్ ఫోన్‌లను ఉచిత వైర్‌లెస్ సెక్యూరిటీ కెమెరాలుగా మార్చుకునే అవకాశం ఉంది.
అది ఎలానో ఏంటో ఒక్కసారి చూద్దామా…?? వాస్తవానికి సెల్ ఫోన్‌లలో సాధారణంగా మంచి కెమెరాలు మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటాయి. ఈ రెండు లక్షణాలతో, అవి నిజమైన కెమెరాల మాదిరి మనకు ఉపయోగపడతాయి. అయితే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. మీ పాత ఫోన్‌ను సరికొత్త వైర్‌లెస్ కెమెరాగా మార్చడానికి మార్కెట్‌లో అందుబాటులో ఉండే అప్లికేషన్‌లు మీకు ఉపయోగపడతాయి.

ఈ యాప్‌లు ఏ ఖర్చు లేకుండా వాడుకోవచ్చు. అయితే రూపాయి ఖర్చు లేకుండా కూడా వాడుకునే అవకాశం ఉంది. కెమెరా రికార్డింగ్‌లను చూసేందుకు ఉపయోగించే మీరు వాడే ఫోన్ లో లేదా మీ పాత ఫోన్ లో ఒక దాంట్లో వీటిని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఈ అప్లికేషన్‌లు లాగిన్ చేయడానికి మీ జీమెయిల్ ఎకౌంటు లేదా ఆపిల్ ఎకౌంటు కావాలి. వ్యూయర్ ఫోన్ ఎండ్ నుండి, యాప్‌లోకి లాగిన్ చేసి, కెమెరా ఫోన్ స్ట్రీమింగ్ చేస్తున్న గది స్క్రీన్‌షాట్‌పై క్లిక్ చేస్తే మీకు వ్యూ కరెక్ట్ గా కనపడుతుంది.
Advertisements
Also Read: గూగుల్, యాపిల్ కంపెనీలకు ఎదురు దెబ్బ..?