ఈ దేశం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయలేకపోతే కనీసం ఈ దేశం కోసమైనా జీవించండని విద్యార్థులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచించారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారత్ ను మార్చండని ఆయన అన్నారు.
కర్ణాటకలోకి హుబ్బలిలో బీవీబీ ఇంజినీరింగ్ కళాశాలలో అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం కోసం పని చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
ప్రపంచంలో భారత్ ను నెంబర్ వన్‌గా చేసేందుకు కావాల్సిన అన్ని అవకాశాలను మీకు ప్రధాని మోడీ ఇచ్చారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలు చదవాలని వారికి షా సూచించారు. కొత్తగా ఆలోచించండని, ముందుకు సాగండని విద్యార్థులకు ఆయన సూచించారు.
విద్యార్థుల కోసమే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని మోడీ కలలు కంటున్నారని అన్నారు. ఆ ఆర్థిక వ్యవస్థతో విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయన్నారు. సాంప్రదాయ మనస్తత్వం, ఫ్రేమ్‌వర్క్ నుండి బయటపడాలని విద్యార్థులకు ఆయన సూచనలు చేశారు.