హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికారులంతా… అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు ఉప ఎన్నిక అభ్యర్థి, తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్. అధికార పార్టీ నేతలకు సహాకరిస్తూ స్థానిక పోలీసులు తమను ప్రచారం చేసుకొనివ్వటం లేదంటూ హౌకోర్ట్‌లో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమీషన్ కేవలం ఎస్పీని బదిలీచేసి చేతులు దులుపుకుందని, కింది స్థాయి అధికారులు కూడా పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం… ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశిస్తూ, ఈనెల 18కి తదుపరి విచారణను వాయిదా వేసింది.