ఆవేశం, ప్రేమ, డ్రగ్స్, బాధ…. ఇవన్నీ కలిసిన సినిమా అనగానే ఇప్పటి యూత్ అందరికీ గుర్తొచ్చే ఏకైక సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండకి స్టార్ హీరో చేసిన ఈ మూవీని మరిపించే స్థాయిలో రాబోతున్న సినిమా తిప్పరా మీసం. శ్రీవిష్ణు హీరోగా, కృష్ణ విజయ్ తెరకెక్కించిన ఈ మూవీ టీజర్ తోనే సినీ అభిమానులని మెప్పించింది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ తిప్పరా మీసం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. రిచ్ అండ్ రగ్గడ్ మేకింగ్, ఇంట్రిగ్యుయింగ్ మ్యూజిక్, థ్రిల్లింగ్ సీన్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్… ఇవన్నీ తిప్పరా మీసం ట్రైలర్ ని ఆ క్లియర్ విజువల్ ట్రీట్ గా మార్చాయి. రా లుక్ లో శ్రీవిష్ణు డిఫరెంట్ మేకోవర్ ఆకట్టుకుంది. అమ్మ సెంటిమెంట్ చుట్టూ వచ్చే కట్ షాట్స్ చాలా బాగున్నాయి. నైట్ ఎఫెక్ట్ లో, అండర్ వాటర్ లో కంపోజ్ చేసిన ఫైట్స్ ట్రైలర్ కే సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉన్నాయి. కలర్ గ్రేడింగ్ విజువల్ ఫాక్టర్ పై చాలా ఇన్ఫ్లూయెన్స్ చేసింది.
తిప్పరా మీసం ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ తో అక్కడక్కడా మదర్ సెంటిమెంట్ సీన్స్ చూపిస్తూ గ్రిప్పింగ్ గా కట్ చేసిన ట్రైలర్ సినిమా హైప్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. అయితే రిలీజ్ కి 24 గంటలు మాత్రమే ఉన్న టైములో ఇంత డిలేతో ట్రైలర్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటో చిత్ర యూనిట్ కే తెలియాలి. ఇదే ట్రైలర్ ఒక వారం లేదా నాలుగైదు రోజుల ముందు రిలీజ్ అయ్యి ఉంటే తిప్పరా మీసం ప్రొమోషన్స్ కి ఇంకా బూస్ట్ ఉండేది. మొత్తానికి ‘నా గతాన్ని పట్టించుకోని సమాజం, నేను చేసిన పనిని తప్పు అంటున్నాయి’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది, మరి శ్రీవిష్ణు చేసిన తప్పు ఏంటి? అతని తల్లి ఎందుకు ద్వేషిస్తున్నాడు? అనేది తెలియాలి అంటే నవంబర్ 8న సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ తిప్పరా మీసం ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.