మూడో తరగతి చదువుతున్న ఏడేళ్ల పిల్లాడు కార్తీక్ స్కూల్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పుదూరు మండలం చిలాపూర్ లోని కేశవ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది.
అయితే ఆ పిల్లాణ్ని టీచర్ కొట్టడంతో కింద పడిపోయాడనీ.. వెంటనే స్కూల్ సిబ్బంది ఆస్పత్రి తీసుకు వెళ్లే లోపే చనిపోయాడని తెలుస్తోంది. అనంతరం స్కూల్ యాజమాన్యం మృతదేహాన్ని చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే దీనిపై బాలుడు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు యాజమాన్యం దౌర్జన్యంగా కొట్టడం వల్లే కార్తీక్ చనిపోయాడంటూ తల్లిదండ్రులు చనుమోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చదువు చెబుతారని స్కూల్ కి పంపితే.. ఏకంగా ప్రాణాలే తీసేశారని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.