ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ మూడో విడతలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రైతుల సంక్షేమం, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ కోసం 11 పాయింట్ల ప్రణాళికను ప్రకటించారు.
తాజాగా ప్రకటించిన ముచ్చటగా మూడో ప్యాకేజీలో వ్యవసాయం, మత్స్య సంపదతో సహా అనుబంధ కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది అని ఆర్థిక మంత్రి చెప్పారు. గిడ్డంగి, కోల్డ్ చైన్‌లతో సహా వ్యవసాయ రంగంలో అగ్రిగేటర్లు, స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం లక్ష కోట్లు ప్రకటించింది.
ఈ లక్ష కోట్ల ప్రయోజనం రైతుల సహకార సంఘాలకు కూడా చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పోషక ఉత్పత్తుల కోసం క్లస్టర్ ఆధారిత తయారీకి 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఇందులో 2 లక్షల ఎంఎఫ్‌ఐ ప్రయోజనం పొందుతుంది. అంటే… కాశ్మీర్‌లో ‘కేసర్’, బీహార్‌లో ‘మఖానా’ క్లస్టర్లుగా ఉండవచ్చు.
ఇక భారతదేశం అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. అతిపెద్ద జనపనార సహా పప్పుధాన్యాల ఉత్పత్తిదారు. చెరకు, పత్తి, వేరుశనగ, పండ్లు, కూరగాయలతో పాటు మత్స్యకారులలో రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశం కాగా, తృణధాన్యాలలో మూడవది. ఈ ఉద్దీపన ప్యాకేజీలతో రైతు రాజ్యం అవతరిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.