తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య పదుల సంఖ్య నుండి వేలకు చేరింది. కేసుల సంఖ్య రెట్టింపవుతుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నా, నిర్లక్ష్యం కారణంగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
వరంగల్ నగరం కాజీపేట మండలం కడిపికొండలో ఒకే రోజు 20 మంది వైరస్ బారిన పడ్డారు. విషయం తెలిసిన వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన కడిపికొండ చేరుకొని ఇంటింటికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి చనిపోగా…ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న వారి నుండి వైరస్ స్ప్రెడ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ 20మందిలో ఒక్క ఇంటికి చెందిన వారే 13మంది ఉండటం గమనార్హం.
అందరికీ టెస్టులు చేస్తుండటంతో… పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.