9 సంవత్సరాల బాలిక పై 32 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలంలోని కౌసల్య దేవి పల్లి శివారు రూప్లా తండాకు చెందిన బాలిక తల్లితండ్రులు పొలం పనులకు వెళ్లిపోగా బడికి వెళ్లకుండా బాలిక ఒక్కతే ఇంటిదగ్గర ఆడుకుంటుంది. అదే సమయంలో అదే తండాకు చెందిన అనిల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చెయ్యబోయాడు. బాలిక కేకలు వెయ్యటంతో అనిల్ భార్య తలుపు తీసి చూసింది. ఈ విషయాన్నీ ఎవరికైనా చెప్తే చంపేస్తా అంటూ బెదిరించాడు. ఆ రోజు సాయంత్రం నుంచి బాలిక అన్నం తినకుండా కూర్చోవటం చూసిన తల్లిదండ్రులు విషయాన్ని తెలుసుకున్నారు. దీనితో బాలిక తండ్రి స్థానిక నర్సింహులపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిందుతుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.