తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ బోర్డు ఆన్ లైన్ లో పెట్టింది. మొత్తం 35రోజుల టికెట్లను ఆన్ లైన్ లో పెట్టగా కేవలం 30నిమిషాల్లో అన్నీ అయిపోయాయి. రోజుకు 8వేల సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఉంచగా, 300ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా అయిపోయాయి.
సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ వరకు ఈ టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టీటీడీ తొలిసారి ఈ సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్ లో ఉంచింది. ఆన్ లైన్ టికెట్లు జారీ చేయటంతో ఆఫ్ లైన్ టికెట్ల జారీని నిలిపివేశారు.
అయితే, టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు కానీ… 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కానీ సమర్పించాలని టీటీడీ షరతు పెట్టింది.