ప్రపంచ వ్యాప్తంగా అనేక పక్షి జాతులు ఉన్నాయి. అయితే వాటిలో ఇప్పటికే అనేక జాతులకు చెందిన పక్షులు అంతరించిపోయాయి. కొన్ని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాయి. అయితే వీటిలోనూ అత్యంత అరుదైన జాతికి చెందిన పక్షులు మాత్రం కొన్నే ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే పక్షి కూడా సరిగ్గా ఆ కోవకే చెందుతుంది.
1843 నుంచి 1848 మధ్య కాలంలో జర్మనీకి చెందిన నాచురలిస్ట్ కార్ల్ స్క్వానర్ బోర్నియోలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఓ చిన్న బ్రౌన్-గ్రే కలర్ ఉన్న పక్షి కనిపించింది. అది black-browed babbler (Malacocincla perspicillata) జాతికి చెందిన పక్షి. అయితే ఆ పక్షి అప్పట్లో కనిపించాక మళ్లీ ఇప్పటి వరకు దాని జాడ లేదు. కానీ ఇటీవలే ఆ జాతికి చెందిన ఇంకో పక్షి మళ్లీ కనిపించింది. దాదాపుగా 170 ఏళ్ల తరువాత ఆ పక్షి జాతి మళ్లీ కనిపించడం ఆర్నిథాలజిస్టులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
5 అక్టోబర్ 2020వ తేదీన ఇండోనేషియాలోని కలిమంటన్ అనే ప్రాంతంలో ఉన్న అటవీ ప్రదేశంలో మళ్లీ ఆ పక్షిని కొందరు చూశారు. దాన్ని ఫొటోలు తీసి అధికారులకు పంపించారు. దీంతో ఆ పక్షి ఒకప్పుడు కనిపించిన పైన తెలిపిన పక్షి జాతికి చెందినదే అని నిర్దారించారు. అయితే ఇన్ని సంవత్సరాల పాటు ఆ జాతికి చెందిన ఒక్క పక్షి కూడా కనిపించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ జాతికి చెందిన పక్షి ఇదొక్కటే ఉందని అంచనా వేస్తున్నారు. అందువల్ల అత్యంత అరుదైన, అంతరించి పోతున్న పక్షుల జాబితాలో ఇది అగ్ర స్థానాల్లో ఉందని చెప్పవచ్చు.
ఇక ఈ పక్షిని ప్రస్తుతం నెదర్లాండ్స్‌లోని లెయిడెన్ అనే ప్రాంతంలో ఉన్న నాచురలిస్ బయో డైవర్సిటీ సెంటర్ లో భద్రంగా ఉంచారు. దాన్ని సైంటిస్టులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పక్షి గురించిన మరిన్ని వివరాలను వారు త్వరలో వెల్లడించనున్నారు.