టాలీవుడ్ లో కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు తమ తమ సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు హీరోలుగా సెటిల్ అయితే మరికొందరు సినిమాల్లోకి రావడానికి కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. వచ్చిన అవకాశాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. తనీష్ సినిమాల్లోకి వచ్చి కొంత కాలానికే కనుమరుగు అయ్యాడు. ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా పెద్దగా రావడం లేదు.
Also Read : జైచిరంజీవలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి ఎలా ఉందో చూడండి…!
చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి స్టార్ హీరోలు, హీరోయిన్ లు అయినవాళ్ళు ఉన్నారు. ఛత్రపతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మనోజ్ నందం కూడా హీరోగా సినిమా చేసాడు. ఇక ఇప్పుడు తేజ సజ్జ కూడా హీరో అయ్యాడు. ఇక మహేష్ బాబు బావ… గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా వచ్చిన నానీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అశోక్ ఇప్పుడు హీరో అనే టైటిల్ తో సినిమా చేసాడు.
మహేష్ బాబు, అమీషా పటేల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా… మహేష్ బాబు ఇమేజ్ మాత్రం బాగా పెంచింది అనే చెప్పాలి. గల్లా అశోక్ నటించిన హీరో సినిమాకు వసూల్లు బాగానే వచ్చాయి. అటు ఉన్నత చదువులతో పాటు సినిమాల మీద ఇష్టంతో సినిమాల్లోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సినిమాల్లో నటించిన అశోక్ కెరీర్ మీద సీరియస్ గానే ఫోకస్ చేసాడు. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
Advertisements
Also Read: అఖండ సినిమా చిన్నారితో బాలయ్య ఎలా ఉంటారు…? బోయపాటి బాగా ఎక్కడ కష్టపడ్డారు…?