సినీ తారలు కేవలం నటనలోనే కాదు, మానవతా హృదయాన్ని చాటడంలోనూ ముందుంటారని నటుడు మహేష్ బాబు, నమత్ర శిరోద్కర్ దంపతులు మరోసారి రుజువు చేశారు. ఇప్పటికే వారు పేదల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. హాస్పిటళ్లలో ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అందులో భాగంగానే వారు తాజాగా ఓ చిన్నారి సర్జరీకి సహాయం చేశారు.
నటుడు మహేష్ బాబు, నమత్ర దంపతులు ఆంధ్రా హాస్పిటల్‌తో భాగస్వామ్యం అయ్యారు. ఈ క్రమంలోనే హాస్పిటల్‌లో చికిత్స కోసం వచ్చే పేదలకు వారు సహాయం అందిస్తున్నారు. తాజాగా ఉమ అనే మహిళకు చెందిన చిన్నారి గుండె ఆపరేషన్‌కు గాను వారు ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో ఆ చిన్నారి కోలుకుని ప్రస్తుతం డిశ్చార్జి అయింది. అయితే ఆపరేషన్ సక్సెస్ అయి ఆ చిన్నారి క్షేమంగా ఉన్నందుకు గాను నమత్ర సంతోషిస్తూ ఆ చిన్నారి గురించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఉమ అనే మహిళ కుమార్తెకు గుండె సర్జరీ గత వారం జరిగింది. ఇప్పుడామె కోలుకుని డిశ్చార్జి అయింది. వారికి సహాయం అందించినందుకు, ఆంధ్రా హాస్పిటల్స్ ఆ చిన్నారిని బతికించినందుకు నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది, ఆ కుటుంబం, ముఖ్యంగా ఆ చిన్నారి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.. అంటూ నమ్రత ఆ కుటుంబానికి చెందిన ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రిస్మస్ వారికి ఎంతగానో స్పెషల్ అని, వారు అలాంటి చిన్నారులకు సహాయం చేస్తుండడం సంతోషంగా ఉందని అన్నారు.
కాగా క్రిస్మస్ నేపథ్యంలో నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నెవా మహేష్ దంపతులకు గిఫ్ట్‌లను పంపించింది. మహేష్, నమ్రతలకు ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఇద్దరు స్టార్లకు చెందిన ఫ్యాన్స్ ఈ హ్యాపీ మూమెంట్‌కు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తుండగా, బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ వకీల్ సాబ్‌లో పవన్ నటిస్తున్నారు.