గత రెండేళ్ళ నుంచి సరిగా సినిమాలు లేకపోవడంతో ఈ ఏడాది విడుదల చేసే సినిమాల మీద హీరోలు చాలా ఆశలు పెట్టుకుని విడుదల చేసారనే చెప్పాలి. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఎన్నో ఆశలతో సినిమాలు విడుదల చేసారు. అయితే అక్కినేని ఫ్యామిలీ కి మాత్రం ఈ ఏడాది అసలు ఏ మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఏ సినిమా చేసినా సరే నిరాశ పరిచింది అనే ఆవేదన ఫాన్స్ లో ఉంది.
బంగార్రాజు సినిమా నాగార్జునకు మంచి జ్ఞాపకాలే ఇచ్చినా ఆ తర్వాత విడుదల చేసిన ఘోస్ట్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత నాగార్జున హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ కూడా ఫెయిల్ అయింది అనే చెప్పాలి. గత 5 సీజన్లు బాగానే నడిచినా ఈ సీజన్ మాత్రం దారుణంగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అందులో పాల్గొనే వారి ఎంపిక అలాగే పాల్గొన్న వారి ప్రవర్తన ఏ మాత్రం బాగాలేదనే టాక్ వచ్చింది.
ఇక నాగ చైతన్య విషయానికి వస్తే వ్యక్తిగతంగా సినిమా పరంగా ఇబ్బందులు పడ్డాడు. సమంతతో విడిపోవడం అతనికి ఈ ఏడాది బాగా మైనస్ అనే అంటున్నారు ఫాన్స్. అలాగే ఈ ఏడాది నటించిన థాంక్యూ సినిమా దారుణంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక అఖిల్ నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.