ప్రజలకు శుద్ధమైన మటన్ అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అడుగులు వేస్తోంది. మటన్ దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు మేకల వదశాలలు ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తోంది.
వీటిని స్థానిక మటన్ షాపులకు లింక్ చేయనున్నారు. వినియోగదారులు అక్కడి నుంచే కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. షాప్ యజమానులు కూడా ప్రభుత్వం సరఫరా చేసే మటనే అమ్మాల్సి ఉంటుంది.