టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వందల సినిమాల్లో నటించారు రాజేంద్ర ప్రసాద్. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోల హవా నడుస్తున్నప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు రాజేంద్ర ప్రసాద్.
కామెడీ సినిమా చేయాలంటే… రాజేంద్రప్రసాద్ తప్ప మరెవరూ చేయలేరు అనే విధంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే రాజేంద్రప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరు. ఎన్టీఆర్ సొంత ఊరు కూడా అదే. విశేషం ఏంటంటే ఈ ఇద్దరి ఇల్లులు పక్క పక్కనే ఉండేవట. రాజేంద్రప్రసాద్ కు ఊహ తెలిసినప్పటికే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఉన్నారట. ఆ తరువాత సినిమాల్లో రాణించాలని చెన్నై బయలుదేరాడట రాజేంద్ర ప్రసాద్.
అప్పుడు ఎన్టీఆర్ ని కలిసి ఈ విషయం చెప్పాడట . ఎన్టీఆర్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాణించడం చాలా కష్టమని నీకంటూ సెపరేట్ టాలెంట్ ఉంటేనే రాణించగలుగుతావని సలహా ఇచ్చారట. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసి ఆలా హీరో అయ్యాడట.
ఇకపోతే మరో సీనియర్ నటి రామ ప్రభ కు రాజేంద్ర ప్రసాద్ స్వయానా అల్లుడు అవుతాడు. శరత్ బాబు ని పెళ్లి చేసుకున్న రమాప్రభ కు పిల్లలు లేరు. దీంతో ఆమె తన సోదరి కుమార్తె చాముండేశ్వరిని పెంచుకున్నారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ కు ఆమెను ఇచ్చి పెళ్లి చేశారు. అలా రాజేంద్రప్రసాద్ కు రమాప్రభ కు మధ్య బంధుత్వం ఏర్పడింది. ఇప్పటికీ కూడా రమాప్రభ కు రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ సపోర్ట్ గా నిలుస్తూ వస్తుంది. ప్రస్తుతం రమాప్రభ మదనపల్లిలో ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
హీరో ఆర్యన్ రాజేష్ భార్య సుభాషిణి ఎవరో తెలుసా ?
రాజమౌళి గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు… నాకు ఫోన్ చేసి లొకేషన్ కు వచ్చేయమంటారు…!