దేశంలో కొన్ని సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రెండు మతాలకు చెందిన వ్యక్తులు స్నేహంతో లేదా ప్రేమతో కలిస్తే అది సినిమాగా మార్చి అందంగా చూపిస్తే దానికి వచ్చే స్పందన వేరు అనే చెప్పాలి. అలా ఈ ఏడాది వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అనే చెప్పాలి. అందమైన కథలుగా దర్శకులు చూపించారు. ప్రేక్షకులు వాటిని ఎక్కడికో తీసుకెళ్ళారు.
సీతారామం
ఈ సినిమాలో హీరోయిన్ ముస్లిం కాగా హీరో హిందూ. అలాగే దేశ సరిహద్దుల్లో అల్లర్లు కూడా ఉంటాయి. అయినా సరే అవి ఏదీ మెయిన్ కాదు ప్రేమే ముఖ్యం అన్నట్టుగా చూపించిన తీరు బాగా ఆకట్టుకుంది.
ఆర్ఆర్ఆర్
ఈ సినిమాలో కూడా హిందూ ముస్లిం స్నేహాన్ని అందంగా చూపించాడు రాజమౌళి. ఎన్టీఆర్ ఈ సినిమాలో ముస్లింగా కొంత కనపడతాడు. ఇక రామ్ చరణ్ హిందువుగా ఉంటాడు. అయినా సరే వారి మధ్య స్నేహాన్ని అందంగా చూపిస్తాడు.
కార్తికేయ 2
ఈ సినిమాలో కృష్ణుడుని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. కృష్ణుడి గొప్పతనాన్ని అందంగా వివరించాడు. అనుపమ్ ఖేర్ మాటల్లో ఆ గొప్పతనం విన్నప్పుడు కృష్ణుడి భక్తులు పండగ చేసుకున్నారు.
కాశ్మీర్ ఫైల్స్
కాశ్మీర్ లో పండిట్ ల మీద జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 340 కోట్లకు పైగా వసూలు చేసింది.