మన తెలుగులో యాక్షన్ సినిమాల కంటే కామెడి సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. గతంలో దర్శకులు కామెడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండే వారు. ఇక హీరోలు కూడా తమ సినిమాల్లో కామెడిని బాగా ఇష్టపడే వారు. అయితే క్రమంగా యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యత పెరగడంతో ప్రేక్షకులు కూడా కామెడి సినిమాలను మర్చిపోయారు. ఇక మన తెలుగులో తప్పక చూడాల్సిన టాప్ 10 కామెడి సినిమాలు ఒకసారి చూద్దాం.
Also Read:బోస్టన్ కన్నా ముంబై బెస్ట్… జయ్ కోటక్ ట్వీట్ వైరల్
ఆ ఒక్కటి అడక్కు: ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నట విశ్వరూపం ప్రేక్షకులు ఎప్పటికి మరువలేరు. ఇక ఈ సినిమాలో రావు గోపాల రావు పాత్ర మర్చిపోలేనిది.
ఆహ నా పెళ్ళంట: ఈ సినిమాలో హీరో కంటే కూడా కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం పాత్ర బాగా హైలెట్ అయింది. వీరిద్దరి కోసం సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తాం.
చిత్రం భలరే విచిత్రం: ఈ సినిమాలో కామెడి గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మీ హావభావాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయి ఈ సినిమాలో.
నువ్వు నాకు నచ్చావ్: వెంకటేష్ కెరీర్ లో ఆయన అభిమానులు గాని ప్రేక్షకులు గాని మర్చిపోలేని సినిమా ఇది. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం కూడా మనల్ని అలరిస్తుంది.
లేడీస్ టైలర్: అడల్ట్ కామెడి ఎక్కువగా ఉన్నా సరే సినిమాలో ప్రతీ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు.
మామగారు: ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కామెడి ఎప్పటికి మరువలేనిది. వాళ్ళ కామెడికి సంబంధించి ఇప్పటికీ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.
బావ బావమరిది : సీల్క్ స్మితా కోసం పడిచచ్చే పాత్రలో కోట బాబు మోహన్ కామెడీ కోసం ఎన్ని సార్లు చూసినా తప్పు లేదు.
జంబ లకిడి పంబ: ఈ సినిమా తర్వాత ఈవీవీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయనలో కామిక్ సెన్స్ కు ఈ సినిమా ఒక బలమైన ఉదాహరణ.
ఏవండి ఆవిడ వచ్చింది : కోటా కామెడీ విశ్వరూపం ఈ సినిమాలో కనపడుతుంది. బాబు మోహన్ కూడా ఈ సినిమాలో మరువలేని పాత్ర చేసారు.
మన్మథుడు: నాగార్జున కెరీర్ లో కామెడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన సినిమా ఇది. బ్రహ్మానందం కామెడి బాగా ఆకట్టుకుంటుంది.
Also Read:బండి మైలేజ్ రావాలంటే ఏం చేయాలి…? గేర్లు మార్చే టైంలో ఇది అసలు మర్చిపోవద్దు…!