మాములుగా స్టార్ హీరోల కొడుకులు సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు అంటే వాళ్లకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కూడా తండ్రులు జాగ్రత్తగా పట్టించుకుని అడుగులు వేస్తూ ఉంటారు. తమ ఇమేజ్ తమ కొడుకులు కాపాడాలనే తపన వారిలో ఎక్కువగా ఉంటుంది. ఇలానే చిరంజీవి కూడా రామ్ చరణ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రామ్ చరణ్ చేసే సినిమాల కథలను చిరంజీవి ఒకటికి పది సార్లు వింటారు.
కథ తనకు నచ్చితే మాత్రమే రామ్ చరణ్ సినిమా చేయాలని అంటారు చిరంజీవి. చిరుత దగ్గరి నుంచి కూడా అదే జరుగుతుంది. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం రామ్ చరణ్… చిరంజీవి మాట వినకుండా చేసి ఇబ్బంది పడ్డాడు. అదే తుఫాన్ సినిమా. ఈ సినిమా కథ గాని అందులో నటుల ఎంపిక గాని చిరంజీవికి ఎంత మాత్రం నచ్చలేదు. రామ్ చరణ్ కు మాత్రం విపరీతంగా నచ్చింది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సినిమా మొదలుపెట్టారు. ఇక బాలీవుడ్ లో కూడా విడుదల చేసారు. బాలీవుడ్ లో పాపులారిటీ కోసం ప్రియాంకా చోప్రాని హీరోయిన్ గా పెట్టారు. ఆ నిర్ణయం మరింత మైనస్ అయింది. కథలో పట్టు లేకపోవడం అనవసరమైన యాక్షన్ సీన్స్ బాగా ఇబ్బంది పెట్టాయి. మగధీర లాంటి హిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ భారీగా ఇబ్బంది పడిన సినిమా ఇది.