ఇండస్ట్రీలో చాలా వరకు ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను సెలెక్ట్ చేసుకొని మరో హీరో హిట్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరికొన్నిసార్లు ఆ కథ డిజాస్టర్ కూడా అవుతూ ఉంటుంది. అయితే గతంలో నందమూరి బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇది మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటి గా నిలిచింది.
నిజానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, హీరోగా, కమెడియన్ గా 500 సినిమాలకు పైగా నటించారు. ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ కూడా ఒక్క హిట్ తో తన స్టామినా ఏంటో చూపించేవారు.
సమరసింహా రెడ్డి సినిమాలో ఒక్క సీన్ నచ్చలేదని సినిమానే వద్దుఅనుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే ?
అయితే ఒకానొక సమయంలో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో ఒక సినిమాను చేసి పెట్టాలి అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మోహన్ బాబు అడిగారట. అప్పటికే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో హిట్ కొట్టి మంచి జోష్ మీద రాఘవేంద్రరావు ఉన్నాడట. అప్పుడు మోహన్ బాబు తో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడట రాఘవేంద్రరావు.
అది విన్న చాలామంది ఈ సమయంలో మోహన్ బాబు తో సినిమా ఎందుకు అది కూడా రీమేక్ అంటూ రాఘవేంద్రరావుకు చెప్పారట. అయినా రాఘవేంద్రరావు ఎంతో కసితో సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అదే అల్లుడుగారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
RRR @ పాట పాడిన సింగర్… బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?
అయితే నిజానికి నందమూరి బాలకృష్ణ ఈ సినిమా చేయాల్సి ఉందట. కానీ కథ నచ్చకపోటం తో నో చెప్పాడట. 1988లో మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రానికి రీమేక్ ఈ చిత్రం. ఇందులో మోహన్ లాల్ రంజనీ జంటగా నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ కథకు బాలకృష్ణ నో నచ్చకపోవడంతో మోహన్ బాబు కు చేరిందట. అలా అల్లుడుగారు సినిమా చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు మోహన్ బాబు. ఇందులో రమ్య కృష్ణ శోభన హీరోయిన్స్ గా నటించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదరగొట్టింది.