కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ బడుగు, బలహీన వర్గాల వారికీ ఊతమిచ్చే విధంగా ఉందని బీజేపీ జాతీయధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
దేశాన్ని హరిత అభివృద్ధి వైపు నండిపించేందుకు రైతు రుణాలకు 20 లక్షల కోట్లు కేటాయించడంతో పాటు శ్రీ అన్న పథకం ద్వారా చిరు ధాన్యాలు పండించే రైతులను ప్రోత్సాహించింది. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
నవ నిర్మాణ దిశ భారతదేశం అడుగులు వేయడానికి, దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని డీకే ఒక ప్రకటనలో తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 79 వేల కోట్లు కేటాయించడం గర్వకారణంగా చెప్పుకొవచ్చు.
దేశ వ్యాప్తంగా 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరిపతి సంఘాలను డిజిటలైజ్ చేయడం కోసం నిధులు కేటాయించడం రైతాంగానికి మేలు చేసే చర్య అని డీకే అరుణ పేర్కొన్నారు.