ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఐపీఎల్ రానే వచ్చింది. రెండవరోజు మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో.. ఢిల్లీ క్యాపిటల్స్ తలబడనుంది. అయితే.. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను జట్టులో ఆడించే అవకాశం ఉంది. కానీ..ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇద్దరు ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది.
రిషబ్ పంత్ సారథ్యం ఆడుతున్న ఢిల్లీ టీం.. న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్, వెస్టిండీస్ ఆటగాడు ఆర్.పావెల్ కు మాత్రమే జట్టులో అవకాశం కల్పించింది. గతంలో 2011లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా.. కలిస్, మోర్గాన్ వంటి ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. అయితే.. కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో ఓ జట్టు ఆడటం ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో సారి మాత్రమే.
ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే..ధోనీ స్టాటజీ ని పంత్ ఫాలో అవుతున్నాడా అంటూ నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ సారథ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ముంబై ఇండియన్స్: రోహిత్, ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్, టిమ్ డేవిడ్, డానియెల్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, బుమ్రా, థంపి.
Advertisements
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, పంత్, ఆర్.పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్,శార్దూల్ ఠాకూక్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్, కె.నాగర్‌కోటి.