డైరెక్టర్ బాబీ దర్మకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ అని చెప్పవచ్చు. ట్రైలర్ చూసిన తరవాత ఫ్యాన్స్ కి ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన తరవాత ట్రోలర్స్ సినిమా స్టోరీ ఇదేనంటూ అంచనాలు వేస్తున్నారు. వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ డ్యూయల్ రోల్ లో నటించినట్టు కనిపిస్తోంది. మెయిన్ విలన్ గా ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఓ షాట్ లో ప్రకాష్ రాజ్ చిరుపక్కన కనిపిస్తున్నాడు.
అంటే చిరు బ్యాచ్ లో ఓ మెంబర్ లో కనిపిస్తున్నాడు. మరోవైపు సినిమా ట్రైలర్ లో చిరంజీవి ‘వీడు నా ఎర.. నువ్వే నా సొర’ అంటూ డైలాగ్ కూడా కొట్టాడు. దీంతో తన బ్యాచ్ లోని ప్రకాష్ రాజ్ పంపించి వీరయ్య.. డాన్ ప్రకాష్ రాజ్ ను పట్టుకుంటాడని ఇదే ఈ చిత్రం స్టోరీ అని ట్రోలర్స్ మీమ్స్ ను క్రియేట్ చేస్తున్నారు. అయితే సినిమా అసలు కథ ఏంటి అన్నది తెలియాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే.
Also Read: ఈ ముగ్గురు హీరోయిన్లకు ప్రభాస్ కలిసి రాలేదా…?
ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో చిరుకి జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలకమైన పాత్రలో నటించారు. మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చారు.