నటి జయ లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది జయలక్ష్మి. అయితే తాను సినీ ఇండస్ట్రీలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ తన కూతుర్ని మాత్రం ఈ రంగంలోకి తీసుకురావాలి అనుకోవడం లేదని చెబుతున్నారు జయలక్ష్మి.
బాల నటిగా చేసింది… ఇదే చాలు, హీరోయిన్ గా చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఆమె కూతురు మరెవరో కాదు, తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో సదా చెల్లెలు గా ఓ అమ్మాయి నటించింది. ఆమెనే లక్ష్మి కూతురు యామిని శ్వేత.
అయితే ఆ సినిమా తరువాత మరో సినిమాలో నటించలేదు. ఇన్నాళ్లు అమెరికాలో ఉన్న శ్వేత వివాహం చేసుకొని కొన్ని కోట్లరూపాయలకు యజమానురాలి గా మారింది. ఇటీవల స్వస్థలమైన విజయవాడ కు మకాం మార్చింది. అయితే శ్వేత అమెరికా నుంచి తిరిగి రావటం ఇండస్ట్రీలో ఓ చర్చ మొదలైంది. జయం లాంటి సక్సెస్ ఫుల్ సినిమా లో నటించిన శ్వేత మళ్లీ నటిస్తుందా అనే అనుమానం కలుగుతోంది.
ALSO READ : బాలయ్య…. ఏమున్నావయ్యా !! వింటేజ్ పేపర్ కటింగ్స్
కానీ జయలక్ష్మి మాత్రం నా కూతుళ్లను ఇండస్ట్రీకి పంపించేది లేదని చెప్తుంది. సినీ ఇండస్ట్రీలో నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో బాధలు పడాల్సి వచ్చిందని నా బిడ్డలు ఆ బాధలు పడకూడదు అందుకే విదేశాలకు పంపించాను. నా కూతుర్ని బాలనటిగా మాత్రమే చూడాలి అనుకున్నాను ఆశ తీరింది. ఆ తరువాత ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకొని విదేశాల్లో సంతోషం గా ఉంది. నా కూతుర్లు నా మాట ఏరోజు కాదనలేదు.
ALSO READ: అఖిల్ ని ఫాలో అవుతున్న మోక్షజ్ఞ ? ఎంట్రీ కంఫర్మ్
ఇంతకన్నా ఆనందం ఇంకేం కావాలి అంటూ చెప్పుకొచ్చింది జయలక్ష్మి. అలాగే యామిని శ్వేతా లేటెస్ట్ ఫొటోస్ కూడా వైరల్ గా మారాయి. ఆమెను చూసినవారంతా కూడా షాక్ కి గురవుతున్నారు.