ఇప్పటికీ పప్పులు, మసాలాలను గుర్తించడంలో మనలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలా సార్లు ఓ పప్పుకు బదులు మరో పప్పు, ఓ మసాల బదులు మరో మసాలను తీసుకుని ఇబ్బందులు పడుతుంటాము.
కానీ న్యూఢిల్లీకి చెందిన అబీర్ అనే బాలుడు మాత్రం అలా కాదు. పప్పులు, మసాలాలను చూడగానే వాటి పేర్లను ఇట్టే చెప్పేస్తాడు. పెద్ద పెద్ద వాళ్లను సైతం తికమక పెట్టె మసాలాలు, పప్పులను సైతం టక్కున గుర్తు పట్టేస్తాడు.
మసాలాలు, పప్పులను బాలుడు టక్కున గుర్తుపడుతున్న వీడియోను సోనికా బాసిన్ అనే మహిళా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో బాలుడి ట్యాలెంట్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.
Advertisements
దీంతో ఆ వీడియోకు పెద్ద ఎత్తున లైక్ లు కొడుతున్నారు. ‘ ఇది అద్భుతము. ఇప్పటికీ నేను పప్పులను గుర్తించడంలో తడబాటు పడతాను. కానీ ఈ బాలుడు తేలిగ్గా గుర్తిస్తున్నాడే.. అంటు కొందరు కామెంట్స్ చేయగా, స్మార్ట్ కిడ్ అంటూ మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు.