ఫ్లోరిడాలో ఓ చిన్న దీవి అమ్మకానికి వచ్చింది. ఇప్పటి వరకు దీని నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది. ఇది ఫ్లోరిడా పామ్ బీచ్ కంట్రీలో ఉంది. దీనిని వారు 218 మిలియన్ డాలర్లకు అమ్మాలనుకుంటున్నట్లు తెలిపారు.
అంటే మొత్తంగా రూ.1800 కోట్లు అనమాట. ఒకవేళ ఎవరైనా ఆ ధర చెల్లించి ఆ దీవిని కనుకు కొనుగోలు చేస్తే ఫ్లోరిడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్ ఇదే అవుతుంది.
ఈ దీవిని 2021లో రియల్ ఎస్టేట్ డెవలపర్ టాడ్ మైకేల్ గ్లాసర్ 85 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి దీనిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఈ దీవిని అమ్మడానికి మూడు రెట్లు ఎక్కువ ధర చెబుతున్నారు. దీనికి 10 టార్పన్ ఐజిల్ అనే పేరు కూడా పెట్టారు.
ఇందులో కొత్తగా 9,000 చదరపు అడుగుల పరిధిలో ఒక ఇంటిని కూడా నిర్మించారు. ఇంకా గెస్ట్ హౌస్, టెన్నిస్ కోర్ట్, ఇతర క్రీడా సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ దీవి 21,000 చదరపు అడుగుల పరిధిలో విస్తరించింది. 98 అడుగులు స్విమ్మింగ్ పూల్ సైతం ఉంది.