రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఇటీవల గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అధిక ధరలు చెల్లించి గ్యాస్ కొనలేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి సమయంలో సామాన్యులకు ఓ గ్యాస్ స్టేషన్ ఓనర్ అండగా నిలబడుతున్నాడు. తాను కొన్న ధర కంటే తక్కువ ధరకే గ్యాస్ విక్రయిస్తూ సామాన్యుల కష్టాన్ని కొంత మేరకు తగ్గిస్తున్నాడు.
అమెరికాలోని ఫియోనిక్స్ గ్యాస్ స్టేషన్ ఓనర్ జశ్వేంద్ర సింగ్ తనకు వచ్చిన రేటు కన్నా 47 సెంట్ల తక్కువకు గ్యాస్ ను విక్రయిస్తున్నాడు. దీంతో ఆయనకు రోజుకు సుమారు 500 డాలర్ల వరకు నష్టం వస్తోంది.
కానీ నష్టాలకు ఆయన భయపడటం లేదు. పైగా ‘ ప్రజలు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. ఇది సంపాదించుకునే సమయం కాదు. డబ్బు సంపాదించుకునేందుకు ఎన్నో మార్గాలు ఉంటాయని, ప్రజలకు సహాయం చేయడమే తన లక్ష్యమని అంటున్నారు.
ఈ నష్టాన్ని పూరించుకునేందుకు గాను జశ్వేంద్రసింగ్, ఆయన భార్య కలిసి దగ్గరలోని ఓ పెట్రోల్ బంకులో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. తద్వారా వచ్చే డబ్బుతో ఆ నష్టాన్ని పూడ్చుకుంటున్నారు.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనుకు నష్టం వచ్చినా పర్వాలేదు కానీ ప్రజలకు సహాయం చేస్తానన్న ఆయన గొప్పమనుసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సింగ్ జీ.. యూ ఆర్ గ్రేట్ అంటూ సలామ్ కొడుతున్నారు.