దేశంలో అత్యధిక నిల్వలు బీహార్‌లో ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం తేలినట్టు తెలిపింది. రాష్ట్రంలోని జముయి జిల్లాలో అత్యధికంగా 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్టు గుర్తించామని పేర్కొంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక నేపథ్యంలో ఈ విషయంపై నితీశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఖనిజాల వెలికితీతకు అనుమతులు ఇవ్వాలని జేడీయూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ, జీఎస్ఐతో పాటు పలు మైనింగ్ సంస్థలతో బీహార్ మైన్స్, జియోలజీ విభాగం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
రాబోయే నెలరోజుల్లో జీ3 స్టేజ్ మైనింగ్ కేంద్ర సంస్థలతో అవహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు అదనపు చీఫ్ సెక్రటరీ, గనుల శాఖ కమిషనర్ హర్జోత్ కౌర్ వివరించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జీ2 సాధారణ అనుమతులను సైతం ఇచ్చేందుకు ఆసక్తిగా చూపిస్తున్నాయని తెలిపారు.
గతేడాది పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు… జముయి జిల్లాలోని గనుల్లో 222.885 మిలియన్ టన్నులు బంగారు నిల్వలు ఉన్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.