దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు బహిష్కృత బీజేపీ నేత నుపుర్ శర్మనే కారణమంటూ సుప్రీం కోర్టు శుక్రవారం మండిపడింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది.
‘ ఈ తాలిబాన్ ఘటన ప్రతిస్పందన చర్య కాదు. ఇది విద్వేషాలు రెచగొట్టిన ఘటనకు ప్రతి చర్యగా జరిగింది కానేకాదు. ఎలాంటి రెచ్చగొట్టె చర్యలు లేకున్నా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి’ ఆర్ఎస్ఎస్ పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేకర్ అన్నారు.
‘ ఎక్కడో హమాస్, ఇస్లామిక్ స్టేట్, తాలిబాన్ ఉన్నాయి. మన దేశంలో సిమి, పీఎఫ్‌ఐలు ఉన్నాయి. ఇది రెచ్చ గొట్టడం జరిగిన చర్య కాదు. అలా నమ్మే వారెవరైనా మరింత అధ్యయనం చేయాలి ‘ అని ఆయన సూచించారు.
ఈ తాలిబాన్ ఘటన వెనక ఉన్న మనస్తత్వం, నమ్మకాల వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. భారత్ ఇతరులకు సహాయం చేసేందుకు తన శక్తిని ఉపయోగించదన్నారు.
‘ ఒక మంచి వ్యక్తి మరొక మంచి వ్యక్తికి సహాయం చేయడానికి, శాంతికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న వారిని ఆపడానికి కూడా తగినంత బలంగా ఉండాలి. సమస్యలను ఎదుర్కోవడానికి రాజ్యాంగపరమైన మార్గాలు ఉన్నాయి. ఎవరికైనా సమస్య ఉంటే రాజ్యాంగపరమైన మార్గాలను ఉపయోగించాలి. అంతేకానీ దాడులు సరికాదు’ అని వివరించారు.