ఉగాది పండగను పురష్కరించుకొని NBK108 చిత్రబృందం.. హీరో నందమూరి బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. “ఈ సారి మీ ఊహకు మించి” అంటూ నటసింహం పోస్టర్లను రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్లలో బాలయ్య బాబు మాస్ లుక్ లో అదిరిపోయారని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.
ఈ సూపర్ అప్డేట్ తో ఫ్యాన్స్ పండుగ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది.ఇక ఈ లుక్ లో బాలయ్యను చూసిన అభిమానులు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని అంటున్నారు. అయితే ఈసారి బాలయ్యతో కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేసేలా మూవీ యూనిట్ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
అయితే కెరీర్ లో తొలిసారి బాలయ్య.. కాజల్ తో జతకడుతున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై హైప్ పెరిగింది. ఇక ఈ సినిమాలో బాలయ్య కుమార్తెగా నటి శ్రీలీల కనిపించబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య,కాజల్, శ్రీలీల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అయితే గతేడాది విడుదలైన బాలకృష్ణ అఖండ సినిమాకు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. ఆయన అఘోర పాత్రకు జై కొట్టారు. దాని తరువాత వచ్చిన వీరసింహా రెడ్డి కూడా బానే ఆడింది. దీంతో జోష్ లో ఉన్న బాలయ్య ఈ చిత్రం పై కూడా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.