తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే… ఆ పది రోజులు నానా హాడావిడి. మద్యాహ్నం నుండి మొదలు ఎ టీవీ పెట్టి చూసినా… బతుకమ్మ పాటలే. బతుకమ్మ ఆటలే. అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నాటి ఎంపీ కవిత. పైగా అప్పుడు ప్రభుత్వం బతుకమ్మ సంబురాల కోసం ప్రత్యేకంగా 10కోట్ల రూపాయాలు కూడా విడుదల చేసేది. దాంతో ఊరురా పండుగ అందులోనూ కవిత సెంటరాఫ్ అట్రాక్షన్.
కానీ, ప్రస్తుతం… తెలంగాణలో బతుకమ్మ బోసిపోయింది. అటు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు, ఇటు మీడియా కూడా అంతగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలుకు 10 కోట్లు ఇచ్చేది. ఈ సంవత్సరం ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదు. అటు ప్రభుత్వం, ఇటు మీడియా పట్టించుకోకపోవడానికి కల్వకుంట్ల కవిత ఓటమి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి పేరిట విదేశాల్లో కూడా బతుకమ్మ సంబరాలు చేసేవాళ్ళు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తితో ఆడుకునే బతుకమ్మ కార్పొరేట్ స్థాయికి వెళ్ళింది, ప్రతి గ్రామంలో బతుమ్మ ఆడాల్సిందే అని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారిచేసేది. ఈ సవత్సరం మాత్రం తూతూ మంత్రంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సవత్సరం బతుకమ్మకు 10 కోట్లు ఇచ్చి ఈ సవత్సరం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. కేవలం కవిత కోసమే 10 కోట్లు ఇచ్చేవారని, కవిత ఒక్కరు ఓడిపోతే తెలంగాణ లో బతుకమ్మ వాడకూడదా… అన్న విమర్శలు ప్రతిపక్షాలనుంచి వస్తున్నాయి.