ఈవారం థియేటర్లలో పెద్దగా సినిమాల్లేవ్. ఎందుకంటే, అంతా సంక్రాంతి సినిమాల కోసం వెయిటింగ్. ఇలాంటి టైమ్ లో సినిమాలు రిలీజ్ చేసినా ప్రేక్షకులు పట్టించుకోరు. పైగా అలా రిలీజైన సినిమాలకు మరో వీకెండ్ కూడా ఉండదు. అందుకే ఈ వీకెండ్ బాక్సాఫీస్ స్తబ్దుగా మారింది.
ఈ వారాంతం కేవలం 3 చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా ఓటీటీలో మాత్రం భారీ హంగామా కనిపిస్తోంది. అడివి శేష్ నటించిన సూపర్ హిట్ మూవీ హిట్-2 ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఇది సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.
ఈ హిట్ సినిమా కంటే, సూపర్ హిట్టయిన మరో కార్యక్రమం అందుబాటులోకి వస్తోంది. అదే అన్-స్టాపబుల్. బాలయ్య-ప్రభాస్ చిట్ చాట్ కు సంబంధించి పార్ట్-1 ఇప్పటికే పెద్ద హిట్టయింది. పార్ట్-2 శుక్రవారం స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీంతో పాటు ఇంగ్లిష్ లో మోస్ట్ ఎవెయిటింగ్ వెబ్ సిరీస్ లు, సినిమాలు కొన్ని వీక్షకులకు అందుబాటులోకి రాబోతున్నాయి.
సంక్రాంతి సినిమాలు థియేటర్లలోకి వచ్చేలోపు ఓటీటీలో చాలా హంగామా కనిపించేలా ఉంది. మరికొన్ని రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు ఓటీటీల్లో కనిపించబోతున్నాయి.