ప్రతి వారంలానే ఈ వారం కూడా థియేటర్స్ కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండగా మరి కొన్ని సినిమాలు ఓటిటి లో రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా ఏప్రిల్ 8న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. కొత్త డైరెక్టర్ కిరణ్ కూరపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే గీత ఆర్ట్స్ పతాకంపై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. అలాగే ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు .
మరో సినిమా… సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డేంజరస్. అప్సరా రాణి, నైనా గంగూలీ కీలకపాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని రేపాయి. ఇది ఒక స్వలింగ సంపర్కుల అయిన ఇద్దరు మహిళల మధ్య ప్రేమకథగా తెరకెక్కుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా ప్రయోగాలు చేసే వర్మ ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నాడు అనేది చూడాలి.
ఇక ఓటీటీ విషయానికి వస్తే స్టాండప్ రాహుల్.. శాంటో మోహన వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు. వర్షం హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, మురళీశర్మ, ఇంద్రజ, కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రముఖ సంస్థ ఆహ లో ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
వీటితో పాటు ఇతర భాషల్లో కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్
మర్డర్ ఇన్ అగోండా (హిందీ) ఏప్రిల్ 8
నారదన్ (మలయాళం) ఏప్రిల్ 8
నెట్ ఫ్లిక్స్
చస్వీ (హిందీ) ఏప్రిల్ 7
ఎత్తర్కుం తునిందావన్ (తమిళ్) ఏప్రిల్ |
ఎలైట్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 8
మెటల్ లార్డ్స్ (హాలీవుడ్) ఏప్రిల్ 8
ద ఇన్ బిట్వీన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ద కింగ్స్ మెన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8
జీ5
ఎక్ లవ్ యా(కన్నడ) ఏప్రిల్ 8
అభయ్ (హిందీ) ఏప్రిల్ 8
సోనీ లివ్
గుల్లక్ (హిందీ) ఏప్రిల్ 7