ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటిటి లో అలాగే థియేటర్స్ లో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే అంత కంటే ముందు మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన కేజిఎఫ్ 2 హవా ఇంకా కొనసాగుతోంది. అలాగే మరోవైపు ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.
ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ కారణం ఏమోకానీ చాలావరకు సినిమాలు రిలీజ్ డేట్ లను ఈ వారం వాయిదా వేసుకున్నాయి. మొదట జయమ్మ పంచాయతీ గురించి మాట్లాడు కోవాలి. యాంకర్ సుమ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలు కూడా పెంచింది. కానీ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంది. అలాగే విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా కూడా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంది.
Advertisements
థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే హిందీ జెర్సీ ఈ నెల 22న రిలీజ్ కాబోతోంది. షాహిద్ కపూర్,మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో జంటగా నటించారు. నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలాగే డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సమర్పణలో గగన్ విహారి, అపర్ణాదేవి జంటగా నటించిన 1996 ధర్మపురి సినిమా కూడా ఈ నెల 22న రిలీజ్ కాబోతోంది. వీటితో పాటు బొమ్మలకొలువు, తపన, నాలో నిన్ను దాచానే, వన్ బై టు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
ఇక ఓటిటి విషయానికి వస్తే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గని సినిమా ఈ నెల 22న ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహలో ఇది స్ట్రీమ్ కానుంది. సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్ గా నటించగా ఉపేంద్ర సునీల్ శెట్టి నదియా కీలక పాత్రలో నటించారు.
అలాగే హి ఈజ్ ఎక్స్‌పెక్టింగ్’ అనే జపనీస్ కామెడీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. పురుషుడు గర్భం దాలిస్తే? అనే కాన్సెప్ట్‌లో ఈ సిరీస్ రాబోతుంది.
మరోవైపు లండన్ ఫైల్స్ అనే సిరీస్ ఏప్రిల్ 21న వూట్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇంకా బిచ్చగాడు ఫేమ్ అరుణ్ విజయ్ హీరోగా నటించిన ‘ఓ మై డాగ్’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ 21న విడుదలవుతోంది. ఇది తెలుగు, తమిళంలో ఈ సినిమా విడుదలవుతోంది.
తమిళ వెబ్ సిరీస్ ‘అనంతం’ 22న జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళ సినిమా ‘అంత్యాక్షరి’ ఈ నెల 22న విడుదల అవుతోంది. సోనీ లివ్ ఓటీటీలో ఈ సినిమా వస్తుంది.