థియేటర్లలోకి ఏకంగా 18 సినిమాలొచ్చాయి. ఈమధ్యకాలంలో ఇన్ని సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం ఎప్పుడూ జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాది ఇదొక రికార్డ్. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ వారం థియేటర్లలో ఎంత సందడి ఉందో, ఓటీటీలో కూడా అంతే సందడి కనిపిస్తోంది.
సమంత నటించిన యశోద సినిమా ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. ఇక నితిన్ నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం కూడా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది.
ఇక్కడితో లిస్ట్ ఆగిపోలేదు. సంతోష్ శోభన్ నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. అటు శ్రద్ధా శ్రీనాధ్ నటించిన విట్ నెస్ అనే మూవీని కూడా ఈవారం ఓటీటీలో నేరుగా విడుదల చేశారు.
ఈ సినిమాలతో పాటు కాఫీ విద్ కాదల్ తెలుగు వెర్షన్ కూడా టాలీవుడ్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. అంజలి నటించిన ఫాల్ అనే సినిమాను కూడా తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమింగ్ కు పెట్టారు.