పవన్ కల్యాణ్ కెరీర్ లోనే కల్ట్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది తొలిప్రేమ. ఇప్పుడీ సినిమా మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయింది. తొలిప్రేమ సినిమా 4కే ప్రింట్ సిద్ధమైంది. ఆడియోను కూడా 5.1లోకి మార్చారు. జూన్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
1998లో రిలీజైంది తొలిప్రేమ. ఈ సినిమాతో కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించింది. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అప్పటికీ, ఇప్పటికీ పవన్ కెరీర్ లో ఈ సినిమాది ప్రత్యేక స్థానం.
పవన్ ఫ్యాన్స్ తో పాటు, టాలీవుడ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా, ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ జరుపుకోనుంది. సినిమా రిలీజై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. తొలిప్రేమను మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈమధ్య రీ-రిలీజ్ కల్చర్ బాగా పెరిగింది. సింహాద్రి రీ-రిలీజ్ కోసం ఏకంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు నందమూరి ఫ్యాన్స్. సో. తొలిప్రేమ కోసం కూడా పవన్ ఫ్యాన్స్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పవన్ నుంచి ఖుషి, జల్సా, తమ్ముడు సినిమాలు రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.