ప్రముఖ నటుడు భాగ్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే వారిని నెల తక్కువ పిల్లలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాని మోడీని విమర్శించే వారిని నెలలు నిండకుండానే మూడో నెలలో పుట్టిన శిశువుగా మనం పరిగణించాలన్నారు. ఎందుకంటే నాల్గవ నెలలో నోరు ఏర్పడుతుందని, ఐదో నెలలో చెవులు ఏర్పాడుతాయన్నారు.
వాళ్లను మూడోనెలలో పుట్టిన వారితో ఎందుకు పోల్చానంటే.. వారు మంచిగా మాట్లాడరు, మంచిని వినలేరు. అందుకే వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలల నిండకుండానే పుట్టిన పిల్లలు, వారి తల్లిదండ్రులు పడే బాధలు భాగ్యరాజ్ కు తెలియదని విమర్శకులు అంటున్నారు. ఆయనకు ఆ బాధ తెలిసి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని విమర్శిస్తున్నారు.
దీంతో భాగ్యరాజ్ క్షమాపణలు తెలిపారు. వికలాంగులను బాధపెట్టేందుకు ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. పొరపాటున నోరు జారినట్టు తెలిపారు. అందుకు అందరూ తనను క్షమించాలన్నారు.