ఆల్కహాల్ సేవించే వారిని పాపాత్ములుగా బీహార్ ముఖ్య మంత్రి నితిశ్ కుమార్ అభివర్ణించారు. శాసన సభలో బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సవరణ బిల్లు – 2022ను ఆమోదించిన అనంతరం ఆయన మాట్లాడారు.
‘ కొందరు మద్యం తాగడానికి వెళ్ళారు. వారు విషపూరితమైన మద్యం సేవించి చనిపోయారు. మద్యం చెడ్డది, అందువల్లనే మద్య నిషేధం అమలు చేయాలి’ అని అన్నారు.
‘ మహాత్మాగాంధీ కూడా మద్యం సేవించడం దారుణమని చెప్పారు. బాపు మాట వినని వాడు మహాపాపి అవుతాడు. ఎన్ని చట్టాలు చేసినా వాటిని ఎవరూ పాటించడం లేదు’ అని తెలిపారు.
బిహార్ ప్రొహిబిషన్, ఎక్పైజ్ సవరణ బిల్లు – 2022ను రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. నేరుగా జైలు శిక్ష బదులుగా పలు నేరాలకు జరిమానాలను విధించే అధికారాన్ని ఈ చట్టం కల్పించనున్నది.