ఇప్పుడు ఎక్కడ చూసినా సరే డోలో మాట వినపడుతుంది. కరోనానో జ్వరమో అర్ధం కాక చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక డోలో వేసినా జ్వరం తగ్గలేదు అంటే అది కరోనానే అని భయపడుతున్నారు. ఇక వారం రోజుల పాటు జ్వరం తగ్గకుండా వస్తే మాత్రం వైరల్ ఫీవర్ అని భయపడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాల దెబ్బకు జ్వరాలు బాగా పెరిగాయి. అందులో ఆహార కలుషితం ద్వారా వచ్చే టైఫాయిడ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది.
కాబట్టి టైఫాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఏంటీ అనేది చూద్దామా…?
టైఫాయిడ్ ఉన్న వాళ్ళు ఏది తిన్నా సరే ఒక్క విషయం మర్చిపోవద్దు. ఏది తిన్నా సరే వేడిగానే తినడం చాలా మంచిది. మజ్జిగ తాగినా సరే వేడి నీళ్ళతో చేసుకున్న మజ్జిగ మాత్రమే తాగండి.
Also read: కళకళలాడుతున్న స్కూళ్లు, కాలేజీలు..!
అలాగే పచ్చి కూరగాయలు, పచ్చి పళ్ళు వంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఏది తిన్నా సరే ఉడికించిన ఆహార పదార్ధాలు తినండి, కాచినవి తాగండి.
Advertisements
టైఫాయిడ్ ఉన్నప్పుడు డు అన్నం చారు తో గాని పెరుగుతో గాని తీసుకోవడం చాలా మంచిది. మీకు తినాలని ఉంటే కూరతో కూడా తినవచ్చు. మాంసాహారం వంటివి అసలు వద్దు, శక్తి కోసం ఓఆర్ఎస్ వంటి వాటిని తాగండి. డాక్టర్ ఇచ్చిన మందుల విషయంలో అలసత్వం లేకుండా ఉంటే వారం రోజుల్లో లేచి తిరగవచ్చు.