గల్ఫ్ దేశాల్లో దుబాయ్ వెళ్ళాలి అనేది చాలా మంది కోరిక. దుబాయి వెళ్ళడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. టూరిస్ట్ గా వెళ్ళాలి అంటే అసలు ఏం ఏం కావాలి…? దుబాయ్ వెళ్ళే వారు గుర్తు ఉంచుకోవాల్సిన విషయాలు ఒకసారి చూస్తే…
Also Read:భలే ఐడియా.. కారుతో హెలికాఫ్టర్..!
కొంత యూఏఈ కరెన్సీ క్యాష్ రూపంలో తీసుకు వెళ్ళాల్సి ఉంటుంది. దుబాయ్ లో చాలా వరకు డిజిటల్ అడాప్షన్ ఉన్నా సరే మెషిన్స్ ను నమ్మడం మంచిది కాదు. ఇక మీ క్రెడిట్ / డెబిట్ కార్డులకు ఇంటర్నేషనల్ ట్రాన్సక్షన్స్ ఎనేబుల్ చేసుకోవడం మంచిది. ట్రాన్సక్షన్ లిమిట్స్ కూడా పెంచుకోవడం మంచిది. ఇక కరోనా సమయం కాబట్టి వాక్సినేషన్ సర్టిఫికెట్ ఫిజికల్ కాపీ అసలు మర్చిపోవద్దు. మీ మొబైల్ కి ఇంటర్నేషనల్ రోమింగ్ ఆక్టివేట్ చేయించుకోవాలి. ఇక దుబాయ్ నగరంలో ప్రయాణించే సమయంలో ప్రభుత్వ టాక్సీలను ప్రిఫర్ చేయడం ఉత్తమం.
స్టార్టింగ్ ప్రైస్ 5 AED నుంచి ఉంటుంది. మహా అంటే 12 AED వరకు తీసుకోగా కార్డ్స్ కూడా తీసుకుంటారు. టూరిస్ట్ దగ్గర తీసుకున్న వాట్ టాక్స్ ను వెనక్కు ఇవ్వడం గమనార్హం. షాపింగ్ చేసే సమయంలో ఆ షాప్ వాళ్ళను అడిగి తీసుకోవాలి. వాళ్ళు పాస్పోర్ట్ కాపీ తీసుకుని ఒక బార్ కోడ్ మీ బిల్ పై ఇస్తారు. అది చూపిస్తే విమానాశ్రయంలో రిఫండ్ వస్తుంది. ఇక గోల్డ్ కొన్నా సరే అక్కడ వాట్ వెనక్కు ఇస్తారు. మనకు అక్కడికి బంగారం ధర పది గ్రాములకు నాలుగు వేల వరకు తేడా ఉంటుంది.
Also Read:బుల్డోజర్ పై బ్రిటన్ ప్రధాని ఫోటోలు వైరల్.. అమ్నెస్టీ ఇండియా విసుర్లు