మారుతున్న సామాజిక పరిస్థితులతో పాటూ శృంగార పోకడలు కూడా మారుతున్నాయి. దీంతో వ్యభిచార కూపం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇంటర్నెట్ సామాజిక మాధ్యామాల సహాపలు కారణాల రీత్యా భారీ స్థాయిలో హైటెక్ వ్యభిచారం సాగుతోంది.
ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు సైతం వ్యభిచారులుగా మారుతున్నారు. శృంగార సుఖంతో పాటూ, సంపాదనకు కూడా దగ్గర దారనే అత్యాశతో ఈ రొంపిలోకి దిగి భవిష్యత్తులు నాశనం చేసుకుంటున్నారు. చాపకింద నీరులా సమాజాన్ని చుట్టుకొస్తున్న ఈ మేల్ ఎస్కార్ట్ వ్యవహారం చుట్టూ పలువురి మోసగాళ్ళు కూడా మాటువేసుకుని ఉన్నారు.
ఇటీవల ఇద్దరు కేటుగాళ్ళు మేల్ ఎస్కార్ట్స్ పోస్టులిప్పిస్తామంటూ నమ్మించి వేలమందికి మస్కాకొట్టారు. అందులో ఒక వ్యక్తి ఆడ గొంతుతో మాట్లాడి వారిని ట్రాప్ చేశాడు. మేల్ ఎస్కార్ట్ స్కామ్ గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ప్లే బాయ్, మేల్ ఎస్కార్ట్ ఉద్యోగాల కోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసే యువకులను ఇద్దరు వ్యక్తులు ట్రాప్ చేశారు. వారిలో ఒక వ్యక్తి ఎన్నారై మహిళగా నటించాడు. ఆడ గొంతుతో ఆ యువకులతో మాట్లాడాడు. సుఖంతోపాటు డబ్బులు వస్తాయని ఆశపడిన వేలాది మంది యువకులు వారి ఉచ్చులో పడి మోసపోయారు. కొందరు వేలల్లో, మరికొందరు లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు.
కాగా, ఈ స్కామ్ విషయం తెలిసిన ఢిల్లీ పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు ఎన్నారై మహిళగా యువకులను నమ్మించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
ఆడ గొంతుతో యువకులతో మాట్లాడి ప్లే బాయ్, మేల్ ఎస్కార్ట్ పోస్టులు ఇప్పిస్తానని ఆశపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. ఈ స్కామ్‌ను బట్టబయలు చేసినట్లు వివరించారు. ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.