అమెరికాలో గన్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తుపాకి చట్టాల్లో మరిన్ని మార్పులు తీసుకురావాలని డిమాండ్ పెరుగుతోంది. తుపాకి చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా శనివారం సుమారు 10 లక్షలకు పైగా మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
దాదాపు అన్ని వయస్సులకు నిరసనకారులు వాషింగ్టన్ లోని నేషనల్ మాల్‌లో శనివారం సమావేశమయ్యారు. 2020లో తుపాకి కాల్పుల్లో మరణించిన వారి సమాధుల ఒక్కో దానిపై ఒక్కో తెల్లని ఫ్లవర్ వేజ్ లను ఉంచారు. ఇలా మొత్తం 45000లకు పైగా ఫ్లవర్ వేజ్‌లను సమాధులపై పెట్టారు.
అనంతరం అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. కాల్పులకు గురికాకుండా మాకు స్వేచ్ఛ కావాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ ర్యాలికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మద్దతు తెలిపారు. కామన్ సెన్స్ గన్ సేఫ్టీ చట్టాన్ని ఆమోదించాలని అమెరికన్ కాంగ్రెస్‌కు ఆయన పిలుపునిచ్చారు.
టెక్సాస్, ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ పాఠశాలలో మే 24న కాల్పులు జరిగాయి. ఇందులో మొత్తం 21 మంది మరణించారు. వీరిలో 19 మంది పిల్లలు ఉండటం గమనార్హం. ఆ తర్వాత కొన్ని రోజులకు న్యూయార్క్‌లోని బఫెలోలో ఓ సూపర్ మార్కెట్ లో కాల్పుల్లో 10 మంది మరణించారు.