పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్ అందింది. ఈ కుటుంబంతో బాటు ముంబైలోని మీ రిలయన్స్ ఆసుపత్రిని కూడా పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. ఈ హాస్పిటల్ కి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కాల్ అందినట్టు పోలీసు వర్గాలు ధృవీకరించాయి.
. డీబీ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లోగడ-గత ఆగస్టు 15 న కూడా ఓ ఆగంతకుడు 8 కాల్స్ చేశాడట. పోలీసులు ఇన్వెస్టిగేట్ చెసి దహిసార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
తాజా బెదిరింపుల నేపథ్యంలో రిలయన్స్ ఆసుపత్రి వద్ద భద్రతను పెంచారు. అంబానీ కుటుంబం లోని కొందరు సభ్యుల పేర్లను కూడా ఆ కాలర్ ప్రస్తావించాడట. ముకేశ్ అంబానీకి హోమ్ శాఖ ఇటీవలే జెడ్ కేటగిరీ సెక్యూరిటీని మరింత పెంచింది. ఆయన భార్యకు వై ప్లస్ కేటగిరీ భద్రత ఇదివరకే ఉంది.
గత ఏడాది అంబానీ ఇంటి బయట నిలిపి ఉంచిన ఓ వాహనంలో 20 జిలెటిన్ స్టిక్స్ తో కూడిన పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. అప్పటి నుంచి సుమారు 30 నుంచి 40 మంది కమెండోలతో ఆయనకు, ఆయన కుటుంబానికి భద్రత కొనసాగుతోంది.