దేశంలో రోజురోజూకు బెదిరింపుల కల్చర్ ఎక్కువవుతోంది. సెలబ్రెటీల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, ప్రజల పక్షాన పోరాడే నేతల వరకు చంపేస్తామంటూ బెదిరింపుల కాల్స్ రావడం సాధారణంగా మారింది. తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
రైతుల హక్కుల కోసం పోరాడుతోన్న టికాయత్‌ను చంపేస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు సంబంధించి బీకేయూ నేత పెర్జివాల్ త్యాగి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
ఆ వ్యక్తి టికాయత్‌ను మొదట తిట్టి, ఆపై చంపేస్తానని బెదిరించినట్లు ఆయన పోలీసులకు వివరించారు. ఇక దీనిపై సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయిందని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు చీఫ్ అభిశేక్ యాదవ్ తెలిపారు. అలాగే, ఎస్ఐ రాకేశ్ శర్మ నేతృత్వంలోని పోలీసులు బృందం టికాయత్ ఇంటికి వెళ్లి విచారణ మొదలుపెట్టింది.
అయితే, గతంలో టికాయిత్‌కు పలుమార్లు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. ఈయన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై రైతులు చేసిన ఆందోళన సమయంలో పెద్ద రైతు నాయకుడిగా ఎదిగారు.