విశాఖ నుండి ముంబై వెళ్తున్న రైలులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. విశాఖపట్నం నుండి వచ్చే రైళ్లలో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతకుడి నుండి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాజీపేటలో లోకమాన్య తిలక్ టెర్మినస్ రైలును, చర్లపల్లి లో కోణార్క్ ఎక్స్ప్రెస్ లను ఆఫీ తనిఖీలు చేశారు రైల్వే పోలీసులు. డాగ్ స్క్వాడ్ సహాయంతో అన్ని బోగీల్లో విస్తృతంగా గాలించారు.
రైళ్లలో అనుమానాస్పదంగా కనిపించిన అన్ని వస్తువులను తనిఖీ చేశారు. ఆగంతకుడు డయల్ 100 కు కాల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కాల్ ఎక్కడ నుండి వచ్చింది అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
ఒకే సారి రెండు ప్రాంతాలకు చెందిన రైళ్లలో బాంబులు పెట్టినట్టు సమాచారం రావడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారుల్లో ఆందోళన మొదలైంది.