పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లోఫర్. ఈ చిత్రంలో వరుణ్ సరసన హీరోయిన్ గా ముంబై భామ దిశాపటాని నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ నాట మాత్రం వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన రాధే సినిమాలో నటిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ అమ్మడికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశం గా మారింది. ఫోన్ కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కు కూడా కాల్ చేసి దిశాను ఎవరూ కాపాడలేరు అని చెప్పారట. అయితే ఈ బెదిరింపు కాల్స్ పై దృష్టి పెట్టిన పోలీసులు ఎవరు చేస్తున్నారు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.