ఆర్ అండ్ బి స్థలంను దర్జాగా కబ్జా చేసిన కొందరిపై సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే నువ్వు ఫిర్యాదు చేసినందు వల్లే మా పై చర్యలు తీసుకున్నారు అంటూ ఆక్రమణ దారులు ఓ విలేకరిని బెదిరించారు. నువ్వు దగ్గర ఉంటే మెత్తగా తన్నే వాళ్ళం దూరం ఉండి బతికి పోయావు అంటూ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలోని ఆర్ అండ్ బి స్థలాలను కొందరు ఆక్రమించి కబ్జా చేశారు.
అయితే అధికారులు వీటిని చూసి తొలగించారు. దీనికి స్థానిక విలేకరి వహీద్ కారణం అంటూ కొందరు ఆక్రమణ దారులు బెదిరింపులకు దిగారు. విలేకరి వహీద్ కు దుర్గని శ్రీను, లాలప్పలు నేరుగా ఫోన్ చేసి బెదిరించారు. నువ్వే కమిషనరేట్ లో ఫిర్యాదు చేశావు .. నాకు కమిషనరే చెప్పాడు అంటూ దర్జాగా బెదిరింపులకు దిగారు.
చేతిలో కలం, పేపర్ ఉంటే ఏదంటే అది రాస్తావా? ఎంత మంది పొట్ట కొడతావు? ఎందరి జీవితాలు నాశనం చేస్తావు అంటూ బూతులు తిట్టాడు. నువ్వు విలేకరి అయినంత మాత్రాన మా గురించి రాస్తావా? అంటూ బెదిరించారు. నువ్వు ఇప్పుడు కొందుర్గు వస్తే ని పరిస్థితి ఎంత డేంజర్ ఉంటుందో నీకు తెలుస్తుంది అంటూ బెదిరించారు. నువ్వు దూరం ఉన్నావు కాబట్టి బతికిపోయావు.
ఊరు మొత్తం నీ మీద భగ్గు మని మండిపడుతుంది. విలేకరులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి లేనిది నీకు ఎందుకు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే నిజానికి ఈ వ్యవవహారంలో 8నెలల క్రితం ఆక్రమనలపై మీడియాలో అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే దీనికి వహీద్ మాత్రమే కారణమని ఆరోపిస్తూ ఇప్పుడు వీరు బెదిరిస్తున్నారు.
ఆక్రమణలకు దర్జాగా పాల్పడటమే కాకుండా విలేకరి పై విరుచుకుపడ్డ ఆ వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫోన్ ద్వారా బెదిరించిన ఆడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.