ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపులతో కూడిన మెయిల్ రావడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మోడీని చంపేందుకు 20కిలోల ఆర్డీఎక్స్ తన వద్ద ఉందని మెయిల్ లో పేర్కొన్నాడు ఆగంతకుడు.
వాటిని ప్రయోగించేందుకు 20 మంది స్లీపర్ సెల్స్‌ని సిద్ధం చేశామని పేర్కొన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.అయితే.. దేశవ్యాప్తంగా 20ప్రాంతాల్లో దాడులకు పథకం వేసినట్టు.. మొత్తం 2 కోట్ల మందిని చంపడమే తమ టార్గెట్ అని పేర్కొన్నాడు.
అతి త్వరలోనే మోడీని హత్య చేస్తానని మెయిల్ లో ప్రకటించాడు. ఆర్డీఎక్స్ దాడులకు సంబంధించి కొంతమంది ఉగ్రవాదులు తనకు సహకరిస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు మెయిల్ లో స్పష్టం చేశాడు.
మోడీకి వచ్చిన బెదిరింపు మెయిల్ ఘటనపై అలర్ట్ అయిన ఎన్ఐఏ అధికారులు.. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ప్రధాని మోడీకి భద్రతను కట్టుదిట్టం చేశారు.