తెలుగు సినిమాలో ఒక్కసారి పాపులారిటీ వస్తే చాలు ఫాన్స్ గుండెల్లో పెట్టుకుంటారు. పాపులారిటీ వచ్చినా రాకపోయినా సరే కొందరు సినిమాల్లో కనపడుతూ ఉంటారు. అయితే వాళ్ళు కనపడితే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే సందర్భాలు అంటూ ఉండవు. అయితే తెలుగు సినిమాలో ఆఫర్ లు అడగకపోయినా సరే కొందరి స్నేహాలతో ఆఫర్ వాళ్ళ ఇంటికే వస్తుంది. అలాంటి నటులు ముగ్గురు ఉన్నారు.
హీరోగా కొంత కాలం సినిమాలు చేసిన ఈ దర్శక దిగ్గజం వారసుడు. ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే కనపడుతున్నాడు. మహేష్ బాబు సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా ఒక పాత్ర పోషించిన అల్లరి నరేష్ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం పెద్దగా కష్టపడటం లేదు. తెలుగు సినిమాకు రాజేంద్ర ప్రసాద్ వారసుడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. తనకు ఆఫర్లు వస్తే మాత్రం చేస్తున్నారు.
రాజీవ్ కనకాల
యాంకర్ సుమ భర్త అయిన రాజీవ్ కనకాల ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో జీవిస్తారు అనే పేరు ఉంది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసినా సరే ఆ తర్వాత మాత్రం ఆయన ఎందుకో సినిమాలకు దూరంగా ఉన్నారు. భార్య బుల్లి తెరపై బిజీగా ఉన్నా సరే ఆయన మాత్రం సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే కొన్ని కొన్ని సినిమాల్లో పాత్రల కోసం అడిగినప్పుడు మాత్రం నో అనరని అంటూ ఉంటారు.
అవసరాల శ్రీనివాస్
స్పోర్ట్స్ రంగం నుంచి వినోద రంగంలోకి అడుగు పెట్టిన ఈ నటుడికి మంచి పలుకుబడి ఉంది. దర్శకుడిగా మంచి టాలెంట్ కూడా ఉంది. ఎలాంటి పాత్ర చేసినా సరే నవ్విస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాట తీరు, యాక్షన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఆయన కూడా సొంత వ్యాపారాల మీద ఎక్కువ ఫోకస్ చేసి సినిమాలకు దగ్గరగా ఉంటూ తన అవసరం ఉంటే వస్తున్నారు.