పేరుకి తమిళ హీరో అప్పటికీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది హీరో సూర్యకు. మొదటి నుంచి కూడా ఎన్నో సూర్య చిత్రాలు తెలుగునాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఇటీవల టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జై భీమ్.
2021 నవంబర్ 2న ఓ టి టి వేదికగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. లాయర్ చంద్రు గా సూర్య ఈ సినిమాలో అద్భుతంగా నటించారు.
ఇక ఇటీవల ఈ చిత్రం ఆస్కార్ కు కూడా ఎన్నికైంది. కొద్ది రోజుల క్రితం, 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రాన్ని అధికారికంగా ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కారికంగా ప్రకటించారు.
కాగా ఈ చిత్రం కు ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మూవీ అవార్డు దక్కింది. అలాగే సూర్య, లిజ్మోల్ జోస్ ల నటనకు గాను ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను వచ్చాయి. ఇదే విషయంపై సూర్య అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రావురమేష్, ప్రకాష్ రాజు తదితరులు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Advertisements
Also Read: నేతాజీ విగ్రహావిష్కరణ.. రెండు పార్టీల ఫైట్